మోక్షజ్ఞ సెట్స్ కు వెళ్లేది ఎప్పుడంటే..?
నందమూరి వారసుడు, బాలకృష్ణ(Balakrishna) కొడుకు నందమూరి మోక్షజ్ఞ(Nandamuri Mokshagna) అరంగేట్రం ఖరారైన విషయం తెలిసిందే. ఈ సినిమాతోనే బాలయ్య చిన్న కూతురు తేజస్విని(Tejaswini) కూడా నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతుంది. అయితే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందనేది మాత్రం కొన్ని రోజులుగా సందిగ్ధంలోనే ఉంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా దసరా సందర్భంగా లాంచ్ అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
సినిమా మొదలుపెట్టడానికి దసరా మంచి సమయమని, అందుకే బాలయ్య(Balayya) దసరాకు ముహూర్తం పెట్టించాడంటున్నారు. అయితే ఈ సినిమా ప్రారంభోత్సం గురించి బాలయ్య(Balaiah) రీసెంట్ గా ఐఫా అవార్డుల్లో అప్డేట్ ఇచ్చాడు. డిసెంబర్ లో మోక్షజ్ఞ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని బాలయ్య చెప్పాడు. ఇప్పటికే లుక్ పరంగా చాలా మేకోవర్ అయిన మోక్షజ్ఞ స్లిమ్ గా చాక్లెట్ బాయ్ లా కనిపిస్తున్నాడు.
అయితే ఈ సినిమా కథను డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prasanth Varma) ఆధ్యాత్మికతను బేస్ చేసుకుని రాసుకున్నట్లు సమాచారం. పాన్ ఇండియా లెవెల్ లో ఆడియన్స్ ను ఈ సినిమా కనెక్ట్ అవాలంటే అలాంటి అంశమే కావాలని ఇప్పటికే కార్తికేయ2(Karthikeya2), హను మాన్(Hanu Man) నిరూపించాయి. అందుకే ప్రశాంత్ వర్మ ఆ లాజిక్ ను వదలకుండా ఆ పాయింట్ ను బేస్ చేసుకునే ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.













