వైజాగ్ లో ఎన్టీఆర్ స్టూడియో?
నందమూరి బాలకృష్ణ నవ్యాంధ్రప్రదేశ్‌లో కూడా సినీనిర్మాణం జరగాలనే ఉద్దేశ్యంతో వైజాగ్ లో ఫిల్మ్ సిటీ కట్టాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. వైజాగ్‌లోని భీమిలి రోడ్డులో ఫిల్మ్ సిటీ నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన 316 ఎకరాల్లో ఫిల్మ్ సిటీస్ కట్టేందుకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తోంది. ఇందుకుగాను ఎకరం 50 లక్షలుగా కేటాయించిందని, ఈ రేటు మరికాస్త తగ్గించే సూచనలు కూడా ఉన్నాయని గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర టెలివిజన్, థియేటర్ అభివృద్ధి సంస్థ అధ్యక్షుడు అంబికా క్రిష్ట ప్రకటించడం తెలిసిందే. కాగా బాలయ్య నిర్మించే స్టూడియోకు తన తండ్రి ఎన్టీఆర్ పేరు పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.













