బ్యూటిఫుల్ మెమరీని షేర్ చేసుకున్న సూపర్ స్టార్ వైఫ్…!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కి ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ ఉందో తెలిసిన విషయమే. మహేష్ వైఫ్ నమ్రత సైతం బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. నమ్రత శిరోద్కర్ హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించారు. సినిమాల్లోకి వచ్చే ముందు నమ్రత అందాల పోటీల్లో పాల్గొన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు.
1993 నమ్రత మిస్ యూనివర్స్ గా పోటీ చేసి విజయాన్ని సాధించింది. తన గెలుపుతో భారత దేశానికి గర్వించదగ్గ మెమరీని అందించింది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే నమ్రత, అప్పుడప్పుడు అందాల పోటీల మూమెంట్స్ ని ఫాన్స్ తో షేర్ చేసుకుంటుంది.
ఈ నేపథ్యంలో రీసెంట్ గా తన ఇంస్టాగ్రామ్ లో ఓల్డ్ మెమరీ షేర్ చేస్తూ ఒక అందమైన జ్ఞాపకం అని పోస్ట్ చేసారు నమ్రత. మిస్ ఇండియా యూనివర్స్ లో ఒక చిన్న పాపతో కలిసి క్యాట్ వాక్ చేస్తున్న వీడియోని ఈమె తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసారు.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. నమ్రత ఓల్డ్ స్వీట్ మెమోరీస్ ని చూసి సూపర్ స్టార్ ఫాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అందంతో పాటు, మంచి మనసున్న మనిషిగా నమ్రత నిరూపించుకున్నారు.
హీరోయిన్ గా తన కెరీర్ ని కంటిన్యూ చేసుంటే ఇప్పటికి ఒక రేంజ్ లో ఉండేదని ఫాన్స్ అంటున్నారు. సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే వంశీ సినిమా షూటింగ్ సందర్భంగా మహేష్ బాబు తో ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. ఇద్దరి మధ్య ప్రేమ సుదీర్ఘ కాలం పాటు సాగింది. ఈ జంట ఘట్టమనేని కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత నమ్రత సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పింది. ఇప్పటికి కూడా నమ్రత సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెడితే చూడాలని అభిమానులు కోరుకుంటూ ఉన్నారు.













