తన జీవితంలోని భయానక సంఘటనని ని షేర్ చేసుకున్న నమ్రత…
టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ వున్న స్టార్ కపుల్స్ లో మహేష్ బాబు, నమ్రత జంట ఒకటి. ఈ జోడి అత్యంత పాపులారిటీని దక్కించుకుని నెట్టింట నిత్యం అభిమానులకు అందుబాటులో ఉంటారు. `వంశీ` సినిమా లో తొలి సారి కలిసి నటించిన ఈ జంట అదే సినిమా షూటింగ్ టైమ్ లో ప్రేమలో పడ్డారు. ఆ ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 2005లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గత 17 ఏళ్లుగా వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు.
రీసెంట్ గా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన నమ్రత పలు వ్యక్తిగత విషయాలతో పాటు వైవాహిక జీవితం గురించి పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది. ఈ సందర్భంగా నమ్రత మాట్లాడుతూ `వైవాహిక బంధం సజావుగా సాగాలంటే భార్యాభర్తల మధ్య నమ్మకం ఉండాలి, మహేష్ తో తన జీవితం ఇంత అందంగా వుండటానికి అదే కారణమని తెలిపింది నమ్రత. ఇద్దరు వ్యక్తుల మధ్య నమ్మకం ఉంటే, అది ఏ బంధమైనా సంతోషంగా సాగుతుందన్నారు.
మహేష్ తో తన వివాహమై పదిహేడు సంవత్సరాలు అవుతుందని, పెళ్లి కాకముందు మేమిద్దరం మంచి స్నేహితులం, అలాగే అన్ని విషయాలు షేర్ చేసుకునేవాళ్లం, మా మధ్య అనుమానాలకు రహస్యాలకు అపనమ్మకాలకు తావు లేదు. ఒక వేళ ఆయన ఎప్పుడైనా బయటకు వెళితే పది సార్లు ఫోన్ లు చేసి విసిగించను. మహేష్ కూడా అంతే అని తెలిపింది. ఇక పిల్లలు గౌతమ్ సితార పుట్టాక మా జీవితమే మారిపోయిందన్నారు.
ఒక తల్లిగా ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నాను, గౌతమ్ పుట్టిన రోజుని మేమంతా ఎప్పటికీ మర్చిపోలేం. అది మా జీవితాల్లో ఓ భయానక సమయం. ఏడో నెలలో చెకప్ కోసం హాస్పిటల్ కి వెళ్తే, పరీక్షించిన డాక్టర్లు బాబు పేగు మెడలో వేసుకున్నాడని తనకి ఊపిరీ కూడా ఆడటం లేదని చెప్పారు. బేబీ కి హార్ట్ బీట్ సరిగా లేదని చెప్పారు. ఈ విషయాన్ని మహేష్ కు ఫోన్ చేసి చెప్పారు. లక్కీగా మహేష్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ సినిమా షూటింగ్ లో ఉండడం వల్ల వెంటనే హాస్పిటల్ కి వచ్చారు అని అన్నారు..
తను వచ్చిన వెంటనే ఆపరేషన్ చేసి బాబుని బయటకు తీశారు. అప్పుడు గౌతమ్ 1.5 కేజీలు మాత్రమే వున్నాడు. బాబు విషయంలో మేము ఏం చెప్పలేమని మహేష్ కు డాక్టర్లు ముందే చెప్పేశారు. దాంతో మూడు వారాల పాటు బాబుని డాక్టర్ల అబ్సర్వేషన్ లోనే ఉంచాల్సి వచ్చింది. రోజుకి 40 గ్రాములు మాత్రమే పాలు పట్టించాలన్నారు. అంతే కాకుండా 10 గ్రాములు మాత్రమే బరువు పెరగాలన్నారు. మేము రోజూ పడుకునే ముందు గౌతమ్ బరువు పెరగాలని దేవుడిని ప్రార్థించే వాళ్లం. గౌతమ్ ఇప్పుడు ఇలా వున్నాడంటే దానికి డాక్టర్లే కారణం` అంటూ తన ఫామిలీ విషయాలను బయట పెట్టారు నమ్రత.













