Namith Malhotra: రామాయణ ఆస్కార్ తెస్తుందంటోన్న నిర్మాత
నితేష్ తివారీ(Nithesh Tiwari) దర్శకత్వంలో రణ్బీర్ కపూర్(Ranbir Kapoor) రామునిగా, సాయి పల్లవి(Sai Pallavi) సీతగా నటిస్తున్న సినిమా రామాయణ(Ramayana). ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా గురించి నిర్మాత నమిత మల్హోత్రా(Namith Malhotra) చాలా గొప్పగా చెప్తున్నారు. రామయణం గొప్పతనం ప్రపంచ వ్యాప్తంగా అందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే ఈ రామాయణను తెరకెక్కిస్తున్నట్టు నమిత్ చెప్పారు.
అయితే రీసెంట్ గా నమిత్ కు రామయణకు ఆస్కార్ వస్తుందా అనే ప్రశ్న ఎదురవగా, దానికి ఆయన సమాధానమిచ్చారు. విజువల్స్ కీలకంగా ఉండనున్న రామాయణ కచ్ఛితంగా ఆస్కార్ తెస్తుందనే నమ్మకం తనకుందని, ఇంకా చెప్పాలంటే ఓ సినిమా సక్సెస్ అనేది మనం దాన్ని ఎలా ప్రమోట్ చేస్తామనే దానిపై ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు.
రామాయణ ను దేశం గర్వించేలా తెరకెక్కిస్తున్నామని, ఈ మూవీని అందరూ సెలబ్రేట్ చేసుకోవాలని, హాలీవుడ్ మూవీ ఓపెన్ హైమర్(oppenheimer) కు ఎలాంటి గుర్తింపు దక్కిందో ఈ సినమిఆకు కూడా అలాంటి గుర్తింపే రావాలని, రామాయణను నిర్మించే అవకాశం తనకు రావడం అదృష్టంగా భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ సినిమాకు నమిత్ తో పాటూ హీరో యష్(Yash) కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ 2026లో, రెండో పార్ట్ 2027లో రిలీజ్ కానున్నాయి.













