Anaganaga Oka Raju: అనగనగా ఒక రాజుకు నాగ్ వాయిస్
నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty) హీరోగా, మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) హీరోయిన్ గా మారి(maari) దర్శకత్వంలో వస్తోన్న తాజా సినిమా అనగనగా ఒక రాజు(anaganaga oka raju). కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేసి అందులో భాగంగానే ట్రైలర్ రిలీజ్ కు ప్లాన్ చేసింది.
వాస్తవానికి అనగనగా ఒక రాజు ట్రైలర్(Anaganaga oka raju Trailer) లాంచ్ ఇవాళ జరగాల్సింది కానీ ఇవాళ మన శంకరవరప్రసాద్ గారు(MSG) ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటూ, భర్త మహాశయులకు విజ్ఞప్తి(BMW) ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా ఉండటంతో తమ ట్రైలర్ కు బజ్ తగ్గుతుందని భావించి, మేకర్స్ ట్రైలర్ ను రేపటికి వాయిదా వేశారు. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ నుంచి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను అందించాడు నిర్మాత నాగవంశీ(Naga Vamsi).
ఈ సినిమాకు అక్కినేని నాగార్జున(Akkineni nagarjuna) వాయిస్ ఓవర్ ఇవ్వనున్నాడని తెలియచేస్తూ నాగ్ కుర్చీలో కూర్చుని వాయిస్ ఇస్తున్న ఫోటోను నాగ వంశీ షేర్ చేస్తూ, ట్రైలర్ రేపు రిలీజ్ కానుందని క్లారిటీ ఇచ్చారు. ముందు నుంచే ఈ సినిమాపై మంచి అంచనాలుండగా, దానికిప్పుడు నాగ్ వాయిస్ ఓవర్ కూడా తోడవడంతో సినిమాపై బజ్ మరింత పెరిగే అవకాశముంది. మిక్కీ జే మేయర్(Mickey j mayar) సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి ఓ పాటను కూడా పాడిన సంగతి తెలిసిందే.













