మైల్ స్టోన్ మూవీకి నాగ్ గ్రీన్ సిగ్నల్?
వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న అక్కినేని నాగార్జునకు నా సామిరంగ సినిమా ఫలితం మంచి రిలీఫ్ ను ఇచ్చింది. నా సామిరంగ కంటెంట్ పరంగా పెద్దగా చెప్పుకోడానికి ఏం లేకపోయినా సంక్రాంతి సీజన్ లో రిలీజవడం వల్ల సినిమా బాగా ఆడి మంచి హిట్ గా నిలించింది. నా సామిరంగ సక్సెస్ ఇచ్చిన జోష్ లో నాగ్ కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు.
ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ తో కలిసి కుబేర అనే మల్టీస్టారర్ చేస్తున్న నాగ్, ఆ తర్వాతి సినిమాను తమిళ డైరెక్టర్ నవీన్ తో చేసేందుకు ఒప్పుకున్నట్లు సమాచారం. వీరిద్దరి కాంబోలో సినిమా గురించి చాలా రోజులుగా డిస్కషన జరుగుతోంది. గతేడాదే నవీన్ ఒక కథతో నాగ్ ను సంప్రదించాడు. అప్పటినుంచే స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఎట్టకేలకు ఇప్పటికి అవి ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది.
పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న ఈ సినిమాలో వివిధ భాషలకు చెందిన నటీనటులు కీలక పాత్రల్లో కనిపిస్తారని జ్ఞానవేల్ రాజా ఈ సినిమాను నిర్మించనున్నట్లు సమాచారం. అయితే నవీన్ తో చేసే ఈ సినిమానే నాగ్ కు వందో సినిమానా కాదా అన్నది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఒకవేళ ఇదే వందో సినిమా అయితే మాత్రం అనౌన్స్మెంట్ నుంచి అన్నీ భారీగానే ఉండనున్నాయి. ఈ ఏడాది మధ్యలో సెట్స్ మీదకు తీసుకెళ్లి, వచ్చే ఏడాది సెకండాఫ్ లో సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకుంటున్నారట.













