Nagarjuna: ఆ రెండు పాత్రలకీ పోలికే ఉండదు

నా సామి రంగ(naa sami ranga) సినిమా తర్వాత నాగార్జున(nagarjuna) మరో సినిమాను చేసింది లేదు. తన 100వ సినిమాగా మంచి కథను చేయాలని చూస్తున్న నాగ్(Nag) కు ఏ కథ నచ్చకపోవడంతో ఈ గ్యాప్ లో వేరే సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ వస్తున్నాడు. అందులో భాగంగానే నాగార్జున ధనుష్(Dhanush) తో కలిసి కుబేర(Kubera) సినిమాతో పాటూ సూపర్ స్టార్ రజినీకాంత్(rajinikanth) తో కలిసి కూలీ(Coolie) సినిమాలో నటిస్తున్నాడు.
ఈ రెండు సినిమాల్లోనూ నాగార్జున కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఈ రెండు సినిమాలకు సంబంధించిన షూటింగ్ ను కూడా పూర్తి చేశాడు నాగార్జున. కుబేర సినిమా ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుండగా, కూలీ సినిమా ఆగస్ట్ 14న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ రెండు సినిమాలపై ఆడియన్స్ కు భారీ అంచనాలున్నాయి.
రీసెంట్ గా ఈ రెండు సినిమాల గురించి నాగార్జున మాట్లాడాడు. కుబేర, కూలీ సినిమాల్లో తాను చేస్తున్న పాత్రలు పూర్తి భిన్నంగా ఉంటాయని, ఈ రెండు క్యారెక్టర్లు నటుడిగా తనకెంతో సంతృప్తినిచ్చాయని తెలిపాడు. కూలీ సినిమాలో తాను చేసిన పాత్ర తాలూకా విజువల్స్ ను డైరెక్టర్ లోకేష్(Lokesh) చూపించినప్పుడు ఆ విజువల్స్ బ్లాస్టింగ్ లా అనిపించాయని లోకేష్ చాలా తెలివైన వాడని, కుబేర సినిమాలో తన క్యారెక్టర్ ను శేఖర్ కమ్ముల(sekhar Kammula) ఎంతో రియలిస్టిక్ గా డిజైన్ చేశాడని నాగార్జున చెప్పాడు.