దూత ప్రీమియర్ టాక్
అక్కినేని నాగచైతన్య దూత అనే వెబ్ సిరీస్ తో ఓటీటీ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ రేపు అంటే డిసెంబర్ 1 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్కు సంబంధించిన ప్రీమియర్ ను కొంతమంది సెలబ్రిటీలకు మరియు మీడియా ప్రతినిధులకు వేయడం జరిగింది.
నార్మల్ గా దేనికైనా కానీ ప్రీమియర్ వేస్తే దాని టాక్ ఎలా ఉందన్నది తెలుసుకోవడానికి అందరూ ఎంతగానో వెయిట్ చేస్తారు. ఇప్పుడు దూత సిరీస్ టాక్ కూడా అలానే తెలుసుకోవాలని అక్కినేని ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఉన్నారు. దానికి తోడు ప్రైమ్ వాళ్లు దూతను చాలా పెద్ద స్కేల్ లో ప్రమోట్ చేయడం కూడా దీనిపై అంచనాలను పెంచాయి.
ఇక్ సిరీస్ ఎలా ఉందన్న విషయానికొస్తే ప్రీమియర్ వేసింది కేవలం రెండు ఎపిసోడ్లేనట. సాగర్ అనే జర్నలిస్ట్ పాత్రలో చైతూ చాలా కొత్తగా ఉన్నాడు. ఎక్కువ శాంతం షూటింగ్ వర్షంలోనూ, రాత్రి టైమ్ లోనే చేయడం వల్ల డిఫరెంట్ ఫీలింగ్ వస్తోంది. ముఖ్యంగా క్లైమాక్స్ కు తీసుకెళ్లే మలులు చాలా బాగున్నాయని చూసిన వాళ్లంటున్నారు. మొత్తం 8 ఎపిసోడ్లుగా రానున్న ఈ సిరీస్ ఎలాంటి రిజల్ట్ ను రాబట్టుకుంటుందో చూడాలి మరి.













