Naga Vamsi: జెర్సీ శాడ్ సినిమా కాదంటున్న వంశీ
మ్యాడ్(Mad) కు సీక్వెల్ గా వస్తోన్న మ్యాడ్ స్వ్కేర్(Mad Square) మార్చి 28న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాత నాగ వంశీ(naga vamsi), డైరెక్టర్ కళ్యాణ్(Kalyan Shankar) ను సంగీత్ శోభన్(Sangeeth Sobhan) ఇంటర్వ్యూ చేశాడు. ఇంటర్వ్యూలో భాగంగా సంగీత్ శోభన్, నిర్మాత నాగవంశీని మీకు శాడ్ సినిమాలు నచ్చవని చెప్తుంటారు ఎందుకు అని అడిగాడు.
దానికి నాగవంశీ జీవితంలో ప్రతి ఒక్కరికీ కష్టాలుంటాయని, కష్టాలు, బాధలు లేని మనిషే ఉండడని, తమ కష్టాలన్నింటినీ మర్చిపోయి ఓ రెండు గంటలు సినిమా చూసి ఎంజాయ్ చేద్దామని వస్తే మనం కూడా సినిమాలో కష్టాలనే చూపిస్తుంటే ఇక ఆడియన్స్ ఎంజాయ్ చేసేదేముందనిపిస్తుందని, అందుకే తనకు బాధతో కూడిన సినిమాలు నచ్చవని నాగవంశీ చెప్పాడు.
మరి అలాంటప్పుడు జెర్సీ(Jersey) ఎంటర్టైనింగ్ మూవీ కాదు కదా, ఒక ఫెయిల్యూర్ మ్యాన్ స్టోరీని ఎందుకు చూపించారు అని సంగీత్ అడగ్గా దానికి నాగవంశీ ఆన్సర్ ఇచ్చాడు. జెర్సీని అందరూ శాడ్ సినిమా శాడ్ ఎండింగ్ అనుకుంటారు కానీ క్లైమాక్స్ లో కొడుకు వచ్చి మా నాన్న ఫెయిల్యూర్ కాదు, చనిపోతానని తెలిసి కూడా ఫైట్ చేసి గెలిచాడని గర్వంగా చెప్తాడు. ప్రేక్షకులు కూడా అదే హై లో థియేటర్ నుంచి బయటికొస్తారని నాగవంశీ చెప్పాడు. జెర్సీ గురించి నాగవంశీ చెప్పిన ఈ థియరీ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.













