నాగశౌర్య జాయినయ్యాడు
ఐరా క్రియేషన్స్‌పై తెరకెక్కుతోన్న సినిమా షూటింగ్లో గాయపడిన హీరో నాగశౌర్య- విశ్రాంతి అనంతరం మళ్లీ షూటింగ్లో జాయినయ్యాడు. షెడ్యూల్ అటూ ఇటూ అయితే ఆర్టిస్టుల డేట్స్ అడ్జెట్కాక నిర్మాత ఇబ్బందిపడాల్సి ఉంటుందన్న ఉద్దేశంతో విశ్రాంతికి తక్కువ టైం కేటాయించి షూటింగ్‌కు హాజరవ్వడం పట్ల చిత్రబృందం ఆనందం వ్యక్తం చేస్తోంది. హైదరాబాద్‌లోని మలక్‌పేట ప్రాంతంలో మొదలైన షూటింగ్లో తొలి షాట్‌ను నాగశౌర్యమీదే చిత్రీకరించారు. ఐరా క్రియేషన్స్‌పై ఛలో తరువాత రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి రమణ తేజ దర్శకుడు. ఈ చిత్రంలో నాగశౌర్య జోడీగా మెహరీన్ కనిపించనుంది. ఈ సందర్బంగా నిర్మాతలు మాట్లాడుతూ నాగశౌర్య గాయపడ్డాడని తెలియగానే ఎంతో కలతపడ్డాం. అయితే త్వరగా కోలుకోని మళ్లీ షూటింగ్‌కు హాజరు కావడం ఆనందంగా ఉంది. తాజా మొదలైన షెడ్యూల్ ఈ నెల 20 వరకూ కొనసాగుతుంది. కొన్ని కీలక సన్నివేశాలు ఈ షెడ్యూల్లో పూర్తి చేస్తాం అన్నారు.













