తండేల్ టీమ్ సర్ప్రైజ్ ప్లాన్
నాగచైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో తండేల్ అనే సినిమా అనౌన్స్ అయిన విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందనుంది. చైతన్య సరసన ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. యదార్థ సంఘటన ఆధారంగా రూపొందనున్న ఈ సినిమాలో చైతూ మత్య్సకారుడిగా కనిపించనున్నాడు.
ప్రస్తుతం ఈ సినిమా గురించి టాలీవుడ్ లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా నుంచి ఈ నెలలో గ్లింప్స్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఆ పనిలోనే మేకర్స్ ఉన్నట్లు సమాచారం. ఈ గ్లింప్స్ కోసం రీసెంట్ గా అల్లు స్టూడియోస్ లో స్పెషల్ సెట్ వేసి మరీ షూట్ చేసినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 20లోపు గ్లింప్స్ ను రిలీజ్ చేసి, 22న రిలీజ్ కాబోతున్న సలార్ తో పాటూ ఈ గ్లింప్స్ ను అటాచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.
ఈ గ్లింప్స్ లో చైతన్య మాస్ లుక్స్ లో పాటూ డైలాగ్స్ కూడా ఉంటాయని, గ్లింప్స్ చాలా బాగా వచ్చిందని యూనిట్ సభ్యులు చెప్తున్నారు. అతి త్వరలోనే ఈ గ్లింప్స్ కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు తెలుస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్‌కు రిలీజ్ చేయాలని మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.













