మరో మజిలీకి రెడీ అయ్యారు. కానీ, రష్మిక వచ్చి చేరింది!
మజిలి, వెంకీమామ వంటి సూపర్‌హిట్ సినిమాల తర్వాత నాగచైతన్య చేస్తున్న సినిమా `లవ్‌స్టోరీ`. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంటున్న సమయంలో లాక్డౌన్ వచ్చి పడింది. దీంతో ఎక్కడి షూటింగ్ అక్కడే ఆగిపోయింది. ప్రస్తుతం షూటింగులకు అనుమతులు ఉన్నా దేశంలో ఉన్న పరిస్థితుల కారణంగా ఇప్పట్లో ఈ సినిమా పూర్తయ్యే అవకాశాలు లేవు. ఈ సినిమా తర్వాత `బంగార్రాజు`, `నాగేశ్వరరావు` చిత్రాల్లో నటించనున్నాడు చైతన్య. ఈ ప్రాజెక్ట్‌తోపాటు మరో సినిమాకు కూడా ఓకే చెప్పేశాడట. విక్రమ్‌కుమార్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాను దిల్‌రాజు నిర్మిస్తాడు. గతంలో విక్రమ్‌కుమార్ దర్శకత్వంలో `మనం` చేశాడు చైతన్య. అలాగే అఖిల్ హీరోగా నటించిన `హలో` చిత్రాన్ని కూడా డైరెక్ట్ చేశాడు విక్రమ్. అయితే ఈ సినిమా పరాజయాన్ని చవిచూసింది.
మజిలీ విజయం తర్వాత తను చేయబోయే ప్రతి సినిమా విభిన్నంగా ఉండాలని కోరుకుంటున్నాడు చైతన్య. అందుకే లాక్డౌన్ టైమ్‌లో ఎన్నో కథలు విన్నాడట. అందులో విక్రమ్ చెప్పిన కథ బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశాడు. ఈ సినిమాకు `థాంక్యూ` అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో మొదట సమంత నటించబోతోందని వార్తలు వచ్చాయి. పెళ్లయిన తర్వాత నాగచైతన్య, సమంత కలిసి నటించిన `మజిలీ` హిట్ అవ్వడంతో మరోసారి ఈ జంట కలిసి నటిస్తుందని, అదీ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతుందని వార్తలు వచ్చాయి. అయితే అది నిజం కాదని, రష్మికా మందన్న హీరోయిన్గా ఎంపికైందని సమాచారం. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందే ఈ సినిమా షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభిస్తారని తెలుస్తోంది.













