ఆ మురిపెం తీర్చుకున్న చైతూ
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య రీసెంట్ గా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరోలతో పాటూ టైర్ 2 హీరోలకు సైతం ఇప్పటికే యూట్యూబ్ ఛానెల్స్ ఉన్నప్పటికీ అందులో పెద్దగా కంటెంట్ మాత్రం పోస్ట్ చేయరు. ట్విట్టర్, ఇన్స్టా మీద ఉన్న ఫోకస్ యూట్యూబ్ మీద పెట్టట్లేదు ఆడియన్స్.
రైట్స్ మొత్తం ఆడియో కంపెనీలకు అమ్మేసి ఉంటారు కాబట్టి సాంగ్స్, ట్రైలర్స్ అప్లోడ్ చేసుకోవడానికి కూడా వీలుండదు. ఇలాంటి ట్రెండ్ నడుస్తున్న టైమ్ లో చైతూ ఛానెల్ పెట్టడం వెనుక ఓ స్పెషల్ రీజన్ ఉందట. చైతూ డిజిటల్ డెబ్యూ చేస్తున్న దూత వెబ్ సిరీస్ డిసెంబర్ 1న ప్రైమ్ లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.
ఈ సిరీస్ ప్రమోషన్ కోసం చైతూ పేరు మీద ఓ ఛానెల్ ఓపెన్ చేస్తే దాని ద్వారా ఎక్కువ రీచ్ వస్తుందని భావించి ప్రైమ్ ప్రతినిధులు స్పెషల్ గా అడగడంతో చైతూ యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేశాడని, దానికి తోడు ఎప్పటి నుంచో చైతూకి ఆ ఆలోచన కూడా ఉండటంతో వెంటనే ఓకే చెప్పాడని సమాచారం. అందులో భాగంగానే తాజాగా కొందరు ఫ్యాన్స్ ను కలుసుకున్న చైతూ ఆ వీడియోను కూడా ఛానెల్ లో రిలీజ్ చేశాడు. మొత్తానికి చైతూ యూట్యూబ్ మురిపెం ఇలా తీరిందన్న మాట.













