నన్ను క్షమించండి.. ఆ మాటలు వెనక్కి తీసుకుంటున్నా … నాగబాబు
ఇటీవల జరిగిన ఆపరేషన్ వాలెంటైన్ ప్రీరిలీజ్ ఈవెంట్లో తాను మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకుంటున్నట్లు నటుడు నాగబాబు తెలిపారు. పోలీస్ పాత్ర 6 అడుగుల మూడు అంగుళాలు ఉండే వ్యక్తులు చేస్తే బాగుంటుంది. 5 అడుగుల మూడు అంగుళాలు ఉండే వ్యక్తులు చేస్తే బాగుండదు అని ఆపరేషన్ వాలెంటైన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడాను. ఆ మాటలను వెనక్కి తీసుకుంటున్నా. ఎవరైనా వాటికి నొచ్చుకొని ఉంటే క్షమించండి. అవి యాదృచ్ఛికంగా వచ్చినవే కానీ, కావాలని అన్న మాటలు కాదు. అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా అని అన్నారు.













