మెగాబ్రదర్ సొంత ఛానెల్ దాని కోసమేనా?
మెగా బ్రదర్ నాగబాబు ఏదైనా విషయంలో ఎటాక్ చేశారంటే అదెలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను ఎవరైనా విమర్శలు చేస్తే నాగబాబు వెంటనే వారిపై దాడి చేస్తారు. పవన్ పై, జనసేన పార్టీపై వచ్చే విమర్శలను తిప్పి కొట్టడానికి నాగబాబు సోషల్ మీడియాను వాడుతుంటాడు.
ఈ క్రమంలోనే తన యూట్యూబ్ ఛానెల్ చాలా పాపులరైంది. తన ఒపినీయన్స్ ను యూట్యూబ్ ఛానెల్ ద్వారానే చెప్తూ ఉంటాడు నాగబాబు. అయితే ఇప్పుడు నాగబాబు తాజాగా `N` మీడియా పేరుతో మరో ఛానెల్ ను రెడీ చేస్తున్నట్లు చెప్తూ ఛానెల్ కు సంబంధించిన లోగోను కూడా రివీల్ చేశాడు. అయితే ఈ ఛానెల్ కేవలం ఎంటర్టైన్మెంట్ ఛానెల్ అని మాత్రమే చెప్తున్నారు.
దీని ద్వారా ప్రస్తుతానికి హెల్త్, భక్తి వార్తలతో పాటూ ఇంటర్వ్యూలను మాత్రమే ప్రేక్షకులకు అందించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతానికైతే యూట్యూబ్ ద్వారానే కంటెంట్ ను అందించనున్నారు. అయితే భవిష్యత్తులో ఇది శాటిలైట్ ఛానెల్ గా మారే అవకాశాలు చాలానే కనిపిస్తున్నాయి. పవన్ ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. 2029 ఎలక్షన్స్ నాటికి పవన్ సింగిల్ గా పోటీ చేసే అవకాశాలున్నాయి. ఈ లోపు పార్టీని స్ట్రాంగ్ చేసి పవన్ చేసే మంచి పనుల్ని జనాల్లోకి తీసుకెళ్లాలంటే సొంత ఛానెల్ కీలకమే. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఈ `N` మీడియా శాటిలైట్ ఛానెల్ గా మారే ఛాన్సుంది.













