నభా నటేష్‌కు మరో బంపర్ ఆఫర్!
కన్నడలో మూడు సినిమాల్లో హీరోయిన్గా నటించి తెలుగులో రెండు సంవత్సరాల క్రితం `నన్ను దోచుకుందువటే` చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన నభానటేష్ తన మొదటి సినిమాతోనే అందర్నీ ఆకట్టుకుంది. తన అందంతో, అభినయంతో దర్శకనిర్మాతల దృష్టిలో పడింది. రెండో సినిమాగా రవిబాబు దర్శకత్వంలో వచ్చిన `అదుగో` చిత్రంలో నటించినా అది ఆమెకు ఏమాత్రం ఉపయోగపడలేదు. రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన `ఇస్మార్ట్ శంకర్` చిత్రంలో పక్కా మాస్ క్యారెక్టర్లో అందర్నీ అలరించింది నభా. తెలంగాణ మాట్లాడే అమ్మాయిగా తన నటనతో మంచి మార్కులు సాధించింది. ఈ సినిమా తర్వాత `డిస్కోరాజా`లో నటించినా ఆ సినిమా విజయం సాధించలేదు. అయితే అవకాశాలు మాత్రం ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి.
ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సంతోశ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు నభా ‘సోలో బ్రతుకే సో బెటరు’ లో కూడా నటిస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పడు ఈ అందాల నభాకు ఓ అద్భుతమైన అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది. అదేమిటంటే.. ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా నటించే అవకాశం. `ఆర్ ఆర్ ఆర్` తర్వాత ఎన్టీఆర్ తన 30వ సినిమా త్రివిక్రమ్ కాంబినేషన్లో చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నభా నటేష్‌ను రెండో హీరోయిన్గా ఎంపిక చేసారని సమాచారం. ఈ సినిమాలో కూడా నభా తెలంగాణ అమ్మాయిగా కనిపించబోతోందట. ‘అయినను పోయి రావలె హస్తినకుస అనే టైటిల్‌ను పరిశీలిస్తోంది చిత్ర యూనిట్. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్స్‌పై ఎస్.రాధాకృష్ణ, నందమూరి కల్యాణ్‌రామ్ ఈ చిత్రాన్నినిర్మిస్తారు. నభా నటేష్‌ను ఈ సినిమాలో హీరోయిన్గా ఎంపిక చేసిన విషయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.













