నాగ్ స్ట్రాటజీ.. నా సామిరంగ!
మొదలవడమే లేట్ గా మొదలవడంతో నా సామిరంగ షూటింగ్‌ను అసలు బ్రేక్ లు లేకుండా శరవేగంగా పూర్తి చేస్తున్నారు. విజయ్ బిన్నీ దర్శకత్వంలో నాగ్ నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి టార్గెట్ గా షూటింగ్‌ను పూర్తి చేసుకుంటుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ ఇంత ఫాస్ట్ గా జరిపించడం వెనుక రెండు స్ట్రాటజీలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఎలాగూ సంక్రాంతి బరిలో గుంటూరు కారం, ఫ్యామిలీ స్టార్, హనుమాన్ ఉన్నాయి. ఈగల్ కూడా వస్తుందంటున్నారు. వెంకటేష్ సైంధవ్ లైన్ లో ఉండనే ఉంది. వీటితో పాటూ రెండు తమిళ సినిమాలు కూడా ఈ రేసులో ఉన్నాయి. ఇంత హెవీ కాంపిటిషన్ మధ్య ఈ సినిమాను రిలీజ్ చేస్తే కమర్షియల్ గా వర్కవుట్ అవడం అంత ఈజీగా కాదు.
ఏదైనా రెండు మూడు సినిమాలు సంక్రాంతి బరి నుంచి తప్పుకుంటే వెంటనే ఆ స్లాట్ ను పట్టుకోవాలని చూస్తున్నాడట నాగ్. లేదా అన్నీ సినిమాలు చెప్పినట్లే బరిలో ఉంటే తమ సినిమాను జనవరి ఎండింగ్లో రిలీజ్ చేయాలనే ప్లాన్ లో నాగ్ ఉన్నట్లు తెలుస్తోంది. నా సామిరంగ రిలీజ్ డేట్ విషయంలో డిసెంబర్ నాటికి క్లారిటీ వచ్చే అవకాశముంది. పక్కా విలేజ్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కుతున్న నా సామిరంగలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.













