కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న మృణాల్
సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న మృణాల్ ఠాకూర్ ఆ సినిమాతో మంచి గుర్తింపును తెచ్చుకుంది. సీతారామం తర్వాత మృణాల్ కు తెలుగులో ఛాన్సులు బాగానే వచ్చాయి. కానీ వచ్చిన ప్రతీ అవకాశాన్ని వాడుకోకుండా చాలా సెలెక్టివ్ గా సినిమాలు ఒప్పుకుంటోంది.
అలా ఒప్పుకుని నానితో హాయ్ నాన్నలో నటించి మరో సక్సస్ను అందుకుంది. మెగాస్టార్ చిరంజీవి, వశిష్ఠ కాంబోలో రానున్న సినిమాలో కూడా మృణాల్ ఓ హీరోయిన్ గా నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే మృణాల్ కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
అయలాన్ ఫేమ్ రవికుమార్ దర్శకత్వంలో రాఘవ లారెన్స్ హీరోగా ఓ సినిమాను చేయబోతున్నాడు. ఆ సినిమాలో హీరోయిన్గా మృణాల్ ను ఎంపిక చేశారట. ఇప్పటికే ఆ సినిమాకు మృణాల్ సైన్ కూడా చేసినట్లు సమాచారం. దీంతో పాటూ లారెన్స్ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో రానున్న సినిమాలో కూడా మృణాల్ హీరోయిన్ గా నటించనుందని కోలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. లారెన్స్ సరసన మృణాల్ నటించనుందని వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజముందో చూడాలి.













