అదే ముఖ్యమంటున్న మృణాల్
సినిమాల్లో చూసిన పాత్రని ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకోవాలంటే ఆ పాత్ర ఎంతో గొప్పగా, బరువైనదిగా ఉండాలి. అలాంటప్పుడే ఆడియన్స్ ఆ పాత్రను మోయడానికి ఇష్టపడతారు. అలా చేసిన ప్రతి పాత్రతో ఆడియన్స్ హృదయంలో ప్లేస్ దక్కించుకోవాలంటే దానికి చాలా టైమ్, అనుభవం అవసరం. కానీ మృణాల్ ఠాకూర్ మాత్రం మొదటి నుంచి చాలా సెలెక్టివ్ గా సినిమాలను ఎంచుకుంటూ ఆడియన్స్ మనసులో చోటు సంపాదించుకుంటుంది.
సీతారామం సినిమాలో సీత గా ఆడియన్స్ మనసు కొల్లగొట్టిన మృణాల్ ఠాకూర్, రీసెంట్ గా హాయ్ నాన్న లో యష్నగా అంతే బలమైన క్యారెక్టర్ చేసి తన సత్తాను చాటుకుంది. ఈ రెండు సినిమాలు మృణాల్ కు ఎంతటి పేరును తెచ్చిపెట్టాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు కావడం వల్లే ఇది సాధ్యమైంది.
అందరిలా కాకుండా మృణాల్ తనకొక బ్రాండ్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకుందంటే దానికి కారణం ఆమె ఎంచుకుంటున్న సినిమాలే. దీనిలో ఉన్న సీక్రెట్ ను మృణాల్ రివీల్ చేసింది. తను చేసిన పాత్రలతో ఆడియన్స్ గుండెల్లో స్థానం సంపాదించాలంటే మంచి పాత్రలు చేయాలి. ఓ సారి సీతగా పేరు తెచ్చుకుంటే నెక్ట్స్ మూవీలో ఆ క్యారెక్టర్ ను మరిపించే పాత్ర లో నటించాలనుకుంటా. అలాంటి స్టోరీ వచ్చే వరకు ఎంతో సహనంగా ఉంటా తప్పించి, ఏది పడితే అది చేసి తప్పు చేయననని, ఎన్ని సినిమాలు చేశానన్న దానికంటే ఎన్ని గొప్ప పాత్రలతో ఆడియన్స్ కు గుర్తున్నాననేదే తనకు ముఖ్యమని చెప్పుకొచ్చింది మృణాల్. ప్రస్తుతం మృణాల్, విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ లో నటిస్తుంది.













