Mohanlal: బయోపిక్ ను రిజెక్ట్ చేసిన మోహన్ లాల్

మలయాళ నటుడు మోహన్ లాల్(Mohan lal) కు కంప్లీట్ యాక్టర్ అనే పేరున్న సంగతి తెలిసిందే. ఒక పాత్రకు ఎంత కావాలో సరిగ్గా తూకం వేసినట్టు నటించడంలో ఆయన ఎంతో నిపుణుడు. కంప్లీట్ యాక్టర్ అనేది మోహన్ లాల్ ఎన్నో ఏళ్లు కష్టపడి తెచ్చుకున్న ట్యాగ్ లైన్. అందుకే దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు. తనకు వచ్చే ప్రతీ ఛాన్స్ విషయంలో బాగా ఆలోచించి, ఒకటికి పది సార్లు ఈ సినిమా చేయొచ్చా లేదా అనుకుని మరీ ఓకే చేస్తూ వస్తున్నారు.
అందుకే ఏ సినిమా పడితే ఆ సినిమాను ఆయన ఓకే చేయడం లేదు. అందులో భాగంగానే మోహన్ లాల్ ఇప్పుడో బయోపిక్ ఆఫర్ ను రిజెక్ట్ చేశారని తెలుస్తోంది. ఆల్రెడీ ఈ ఇయర్ లో ఎంపురాన్(Empuraan), తుదరమ్(Tudaram), హృదయపూర్వం(Hridayapoorvam) సినిమాలతో మోహన్ లాల్ బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ ను అందుకున్నారు. అయితే కొన్నాళ్ల కిందట మోహన్ లాల్, ప్రముఖ డైరెక్టర్ టిజె జ్ఞానవేల్(TJ Gnanavel) తో ఓ సినిమా చేయనున్నారని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
శరవణ భవన్ వ్యవస్థాపకులు రాజగోపాల్(Rajagopal) లైఫ్ స్టోరీపై జ్ఞానవేల్ సినిమా చేస్తున్నారని, అందులో మోహన్ లాల్ నటిస్తున్నారని, ఆ సినిమాకు దోశ కింగ్(Dosa King) అనే టైటిల్ ను అనుకుంటున్నారని వార్తలు రాగా, మోహన్ లాల్ ఇప్పుడా ప్రాజెక్టు ను రిజెక్ట్ చేశారని తెలుస్తోంది. రాజగోపాల్ జీవిత కథ అంత ఆషామాషీ కాదు. ఆయనపై హత్య ఆరోపణల విషయంలో జీవిత ఖైదు శిక్ష కూడా ఉంది. అయితే ఈ ప్రాజెక్టు గురించి జ్ఞానవేల్, మోహన్ లాల్ కు చెప్పగా కొన్ని డిస్కషన్స్ తర్వాత మోహన్ లాల్ ఆ ప్రాజెక్టు ను రిజెక్ట్ చేశారని తెలుస్తోంది. అయితే అదే ప్రాజెక్టును టిజె జ్ఞానవేల్ సత్యరాజ్(satyaraj) తో చేయాలని అతన్ని సంప్రదిస్తున్నారని సమాచారం.