Mohanlal: రెమ్యూనరేషన్ పెంచనున్న మోహన్ లాల్?
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్(Mohan Lal) వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్నారు. ఎల్2: ఎంపురాన్(L2: Empuraan), తుదరమ్(Thudaram) సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న ఆయన ఇప్పుడు తన రెమ్యూనరేషన్ ను పెంచనున్నట్టు తెలుస్తోంది. రీసెంట్ గా ఓ మలయాళ నిర్మాత ఈ విషయంపై మాట్లాడుతూ కొన్ని విషయాలను తెలిపారు.
మోహన్ లాల్ సినిమాలు వరుసగా హిట్లు అవడమే కాకుండా ఆ సినిమాలు రూ.350 కోట్లకు పైగా వసూలు చేయడం, ఇప్పటికీ ఆ మూవీస్ థియేటర్లలో రన్ అవుతుండటంతో మోహన్ లాల్ కు తన మార్కెట్ విలువ తెలిసిందని, అందుకే తన తర్వాతి సినిమా కోసం పారితోషికాన్ని పెంచబోతున్నారని సదరు నిర్మాత తెలిపారు.
ఆయన చెప్పిన దాన్ని బట్టి మోహన్ లాల్ తన తర్వాతి సినిమాకు గల్ఫ్ ఓవర్సీస్ హక్కులతో పాటూ రూ.20 కోట్ల పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన రీసెంట్ ట్రాక్ రికార్డు చూస్తే ఆ మాత్రం రెమ్యూనరేషన్ పెంచడం మామూలు విషయమే. అయితే మోహన్ లాల్ రూ.20 కోట్లు తీసుకుంటే మాత్రం మలయాళ ఇండస్ట్రీలో ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకునే హీరోగా ఆయన రికార్డుకెక్కడం ఖాయం.






