Mohanlal: కొడుకుని చూసి ముచ్చటేస్తుంది
కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్(mohanlal) రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. మోహన్ లాల్ కు ఓ కూతురు, కొడుకు ఉన్నారనే విషయం తెలిసిందే. కూతురు విస్మయి(vismayee) ఓ రచయిత్రి అని, రీసెంట్ గానే విస్మయి రాసిన బుక్ మార్కెట్ లోకి రిలీజైందని, ఆ బుక్ చదివిన ప్రముఖులు విస్మయిని ప్రశంసింస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని మోహన్‌లాల్ తెలిపారు.
తన కొడుకు ప్రణవ్(Pranav) అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి, తర్వాత హీరోగా మారాడని, అయితే ప్రణవ్ ఎప్పుడూ తనలా ఉండడని, వర్క్ అవే పేరుతో ప్రపంచాన్ని చుట్టే పనిలో ఉంటాడని, ప్రస్తుతం స్పెయిన్ లోని ఫామ్ లో గొర్రెలూ, గుర్రాలూ కాస్తున్నాడని, ప్రణవ్ జీవితాన్ని కొత్తగా ఆస్వాదిస్తుంటే చాలా ముచ్చటగా అనిపిస్తుందని మోహన్ లాల్ అన్నారు.
తనకు తెలుగు హీరోలు ఎన్టీఆర్(NTR), ఏఎన్నార్(ANR) అంటే చాలా అభిమానమని, ఎన్టీఆర్ హీరోగానే కాకుండా సీఎంగా కూడా ఎన్నో మంచి పనులు చేశారని దానికి ఆయనపై తనకు ఎంతో గౌరవముందని, ఏఎన్నార్ తో కలిసి గాండీవంలో వర్క్ చేయడాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. షూటింగ్ లేకపోతే ఇంట్లో ఎన్నోరకాల వెరైటీలు తింటానని చెప్తున్న ఆయన తినడంతో పాటూ వంట కూడా బాగా చేస్తానని చెప్తున్నారు.






