Mohanlal: ఆ క్షణం ఎంతో గర్వించా
60 ఏళ్ల వయసులో కూడా మోహన్‌లాల్(Mohanlal) కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. రీసెంట్ గా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని తన వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకున్నారు. కెరీర్లో సినిమాను ప్రేమించినంత దేన్నీ ప్రేమించలేదని చెప్తున్న ఆయన, ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో మూడు నాలుగు సినిమాలను లైన్ లో పెడతానని, ఎందుకు ఇంత రిస్క్ అని ఇంట్లోవాళ్లు అంటుంటారని, కానీ తనకు విశ్రాంతి తీసుకోవడం అసలు నచ్చదని మోహన్ లాల్ అన్నారు.
ఆర్మీ అంటే ఎంతో ఇష్టమని చెప్తున్న ఆయన, తాను చేసిన సినిమాలతో యువతకు స్పూర్తినిచ్చిందుకు దేశ ప్రభుత్వం తనకు టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ హోదాను ఇచ్చిందని, ఆ హోదా దక్కినప్పుడు ఎంతో గర్వించాననని, దాని వల్లే విపత్తులు వచ్చినప్పుడు సైన్యంతో కలిసి సహాయక చర్చల్లో పాల్గొనగలుగుతున్నానని ఆయన చెప్పారు.
మమ్ముట్టి(Mammotty) తనకు ప్రాణ స్నేహితుడని, ఇప్పటికే తనతో కలిసి దాదాపు 50 సినిమాలు చేశానని, ఇద్దరం కలిసి మరిన్ని సినిమాల్లో నటించాలనేది తన కోరికని చెప్తున్న మోహన్ లాల్ కనీసం రోజులో ఒక్కసారైనా మమ్ముట్టితో మాట్లాడుతుంటానని, లేకపోతే ఏమీ తోచదని చెప్పారు. అయ్యప్పస్వామి భక్తుడైన తాను అప్పుడప్పుడు మాల వేసుకుని, కాలినడకన వెళ్లి ఇరుముడి సమర్పించి వస్తుంటానని, ఆత్మీయుల కోసం కూడా పూజలు చేస్తుంటానని, పూజల వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుందని ఆయన అన్నారు.






