ఇండస్ట్రీకి చెందిన కుటుంబంతో వియ్యం అందుకోనున్న కీరవాణి
ఇండస్ట్రీలోని పెద్ద కుటుంబాల మధ్య పెళ్లి సంబంధాలు కుదరడం ఇప్పుడు కొత్తగా ఏమీ జరగడం లేదు. బాలీవుడ్ లో ఈ పద్దతి చాలా ఎక్కువగా ఉంటే టాలీవుడ్ లో కూడా అప్పుడప్పుడు ఇలాంటి సంబంధాలు కుదురుతుంటాయి. ఇక అసలు విషయానికొస్తే టాలీవుడ్ లోని రెండు పెద్ద కుటుంబాలు ఇప్పుడు వియ్యం అందుకోబోతున్నట్లు తెలుస్తోంది.
కీరవాణి కుటుంబం, మురళీ మోహన్ కుటుంబంతో చుట్టరికం కలుపుకోవడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. కీరవాణి చిన్న కొడుకు సింహా కోడూరి, మురళీ మోహన్ మనవరాలిని పెళ్లి చేసుకోబోతున్నాడట. వీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారని, దానికి ఇద్దరూ ఫ్యామిలీలు ఒప్పుకోవడంతో ఈ జంట ఒకటి కాబోతున్నట్లు సమాచారం.
త్వరలోనే వీరిద్దరి ఎంగేజ్మెంట్ ఉంటుందని తెలుస్తోంది. కాకపోతే కీరవాణి పెద్ద కొడుకు కాలభైరవకు ఇంకా పెళ్లి కాకపోవడంతో మరి భైరవకు పెళ్లయ్యాకే వీరి పెళ్లి ఉంటుందా లేక ముందు సింహా పెళ్లి ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికైతే సింహా పెళ్లి మురళీ మోహన్ మనవరాలితో అన్నది మాత్రం ఖాయం.













