చిరూ, కీరవాణిల కాంబో ఈ సారి ఎలా ఉంటుందో
కొంతమంది హీరోలకు మ్యూజిక్ డైరెక్టర్ల కాంబినేషన్లు భలే సెట్ అవుతాయి. రెండు, మూడు హిట్స్ అయితే చాలు తర్వాత కొన్నేళ్ల పాటూ వారినే కంటిన్యూ చేస్తారు. రెహమాన్, ఇళయరాజాలకు ఇలాంటి రికార్డులు చాలానే ఉన్నాయి. కానీ చిరంజీవి, కీరవాణి కాంబో మాత్రం ఎక్కువ సార్లు రాలేదు. వీరిద్దరి కాంబోలో వచ్చిన ఫస్ట్ మూవీ ఘరానా మొగుడు.
ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలవడమే కాకుండా ఆ రోజుల్లో మంచి మ్యాజికల్ హిట్ గా కూడా నిలిచింది. ఘరానా మొగుడు సినిమా తర్వాతే కీరవాణికి మాస్ మూవీస్ క్యూ కట్టాయి. తర్వాత వారి కాంబోలో వచ్చిన ఆపద్భాందవుడు మూవీ ఎవరగ్ గ్రీన్ అనిపించుకున్నప్పటికీ బాక్సాఫీస్ పరంగా మాత్రం సినిమా డిజాస్టర్ అయింది.
ఆ తర్వాత వీరి కాంబోలో ఎస్పీ పరశురామ్ అనే సినిమా వచ్చినప్పటికీ ఆ సినిమా కూడా ఫెయిల్ అయింది. ఆ తర్వాత చిరూ మణిశర్మ, కోటిలతోనే సినిమాలు చేయించుకున్నాడు. ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్ల తర్వాత చిరంజీవి కోసం కీరవాణి సంగీతం అందించబోతున్నట్లు సమాచారం. బింబిసార ఫేమ్ వశిష్ఠ తో చిరూ చేయనున్న ఫాంటసీ మూవీ కోసం కీరవాణి అయితే న్యాయం చేయగలడని ఆయన్ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ కాని ఈ సినిమాకు ముల్లోక వీరుడు అనే టైటిల్ను పరిశీలిస్తున్నారట. ఈ సినిమాకే కీరవాణి సంగీతం అందించబోతున్నాడు. ఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ అందుకున్న కీరవాణితో కలిసి పనిచేయడానికి మెగాస్టార్ కూడా చాలా ఎగ్జయిటింగ్ గా ఉన్నాడట. ఈ సినిమాను ఆగస్ట్ 22న చిరూ పుట్టిన రోజు సందర్భంగా వెల్లడించే అవకాశాలున్నాయి.













