‘మిస్టర్ ప్రేమికుడు’ ఫస్ట్ లుక్ విడుదల
ప్రభుదేవా, ఆదాశర్మ, నిక్కీ గల్రానీ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం మిస్టర్ ప్రేమికుడు. శక్తి చిదంబరం దర్శకత్వం వహించారు. వి.శ్రీనివాస రావు నిర్మాత. ఈ నెలలోనే విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ప్రభుదేవాకి అభిమానులున్నారు. వాళ్లందరికీ ఈ ప్రయత్నం నచ్చుతుంది. తమిళంలో ఘన విజయం అందుకున్న చార్లి చాప్లిన్ చిత్రానికి అనువాద రూపమిది. పాటలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ద్వితీయార్ధంలో వచ్చే సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. త్వరలో ఆడియోని విడుదల చేస్తాం అన్నారు. సంగీతం : అమ్రీష్













