మాజీ సీఎం మనవడితో నటి మెహ్రీన్ నిశ్చితార్థం
తెలుగు చిత్ర పరిశ్రమకు కృష్ణగాడి వీర ప్రేమకథ లో నానికి జోడీగా నటించిన పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా మాజీ ముఖ్యమంత్రి మనువడికి రింగ్ పెట్టేసింది. మధ్యప్రదేశ్ జైపూర్‌లోని అలీలా కోటలో మెహ్రీన్ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ఆమెకు హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బిష్ణోయ్ కుమారుడున, ఆడంపూర్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్ కుమారుడే భవ్య బిష్ణోయ్‌తో నిశ్చితార్థం జరిగింది. త్వరలోనే వీరి వివాహం అంగరంగ వైభవంగా జరనుంది. దీనికి సంబంధించిన ఫొటోలను మెహ్రీన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. నిశ్చితార్థ వేడుకలో భాగంగా భవ్య బిష్ణోయ్‌తో మెహ్రీన్ పూజలు చేసింది. అనంతరం వీరిరువురు రింగులు మార్చుకున్నారని తెలుస్తోంది.
హరియాణా ముఖ్యమంత్రిగా భజన్ లాల్ బిష్ణోయ్ పని చేశారు. మూడు పర్యాయాలు ఆయన సీఎంగా ఉన్నారు. అతడి మనవడు భవ్య బిష్ణోయ్‌తో ఆమె వివాహం నిశ్చయమైంది. వీరిది హరియాణాలో రాజకీయ పలుకుబడి ఉన్న కుటుంబం. ఈ వేడుకకు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ విల్లా ప్యాలస్ వేదిక కానుంది. ఎఫ్ 2, కవచం సినిమాతో ఆకట్టుకున్న ఈ భామ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఎఫ్ 3 సినిమాతో బిజీగా ఉంది.













