వెబ్ సిరీస్‌లో మెగాస్టార్?
మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత డిజిటల్ రంగంలోకి ప్రవేశిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఫ్యాషన్ టెక్నాలజీ స్టూడెంట్ అయిన సుస్మిత తండ్రి చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 150, సైరా నరసింహారెడ్డి చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసింది. ఇప్పుడు డిజిటల్ రంగంలోకి రాబోతున్నారని తెలుస్తోంది. కొత్త కథలతో కొన్ని వెబ్ సిరీస్‌ను ప్రారంభించడానికి సన్నద్ధమవుతున్నారు. సుస్మిత చేసే వెబ్ సిరీస్‌లన్నీ తన మేనమామ అల్లు అరవింద్ ఆధ్వర్వంలో నడుస్తున్న ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై విడుదలయ్యేలా ప్లాన్ చేసుకుంటోంది.
అంతేకాదు తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కూడా ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తోందని సమాచారం. తను ఇలా వ్యాపార రంగంలోకి రావడానికి ఇన్స్పిరేషన్ తన సోదరుడు రామ్‌చరణ్ భార్య ఉపాసన అని చెప్తోంది సుస్మిత. తాతకు సంబంధించిన అపోలో హాస్పిటల్ బాధ్యతలు నిర్వర్తిస్తూనే సెలబ్రిటీల డైట్ ఎలా ఉంటుంది అనే విషయాలపై అప్పుడప్పుడు ఇంటర్య్వూలు చేస్తుంటుంది ఉపాసన. అలాగే సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టీవ్‌గా ఉంటుంది. అందుకే తనకు ఉపాసన ఇన్స్పిరేషన్గా నిలిచిందని చెబుతోంది సుస్మిత.













