మెగాస్టార్ నెక్ట్స్ మూవీ టైటిల్ అదేనా?
భోళా శంకర్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి తన తర్వాతి సినిమాను బింబిసార డైరెక్టర్ వశిష్ఠతో చేయడానికి రెడీ అవుతున్నాడు. మోకాలి సర్జరీ తర్వాత తన ఫిట్నెస్ విషయంలో కేర్ తీసుకుంటున్న చిరూ వాస్తవానికి భోళా శంకర్ తర్వాత కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సినిమా చేయాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా తాత్కాలికంగా ఆగిపోయింది.
దీంతో ఇప్పుడు మెగాస్టార్ వశిష్ఠతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. స్టోరీ మొత్తం రెడీ అయింది. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. పక్కా ప్లానింగ్ తో ఈ సినిమాను సెట్స్ కు తీసుకెళ్లేలా ఇటు చిరూ, అటు వశిష్ఠ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ మూవీకి ఎలాంటి టైటిల్ పెడతారనే విషయంలో ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు ముల్లోక వీరుడు అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నాడట డైరెక్టర్. కానీ చిరూ మాత్రం ఈ టైటిల్ విషయంలో శాటిస్ఫై కావడం లేదని, ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్టు టైటిల్ ఉండాలని చెప్తున్నాడట. మరి ఆఖరికి ఏ టైటిల్ ను ఫిక్స్ చేస్తారో చూడాలి. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.













