ఉప్పెనలా వస్తున్నాడు
సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్టవ్ తేజ్ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. మైత్రీ మూవీస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విజయ్ సేతుపతి కీలక పాత్రధారి. బుచ్చి బాబు దర్శకుడు. ఈ చిత్రానికి ఉప్పెన అనే పేరు ఖరారు చేశారు. కథకి సరిపడే పేరు ఇది. ఈ నెలలోనే చిత్రీకరణ మొదలెడతాం. సుకుమార్ శిష్యుడిగా చిత్రసీమలో అడుగుపెడుతున్న బుచ్చిబాబు దర్శకుడిగా తొలి చిత్రంలోనే తనదంటూ ఓ ముద్ర సృష్టిస్తారన్న నమ్మకం ఉందని నిర్మాతలు తెలిపారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం:శ్వామ్దత్.













