మాయ చేస్తున్న లక్కీ స్టార్
ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగులో చిత్రసీమలోకి అడుగు పెట్టిన మీనాక్షి చౌదరి తన కెరీర్ లో సూపర్ హిట్ కొట్టకపోయినా సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించే అవకాశం మాత్రం అందుకొంది. తన మొదటి సినిమా మరియు రవితేజ సరసన నటించిన ఖిలాడి మూవీ అంతగా పేరు తీసుకురాలేదు కానీ తరువాత నటించిన హిట్2 మూవీ సక్సెస్ అవడంతో ఆమెకి అదృష్టం కలిసొచ్చిందనే చెప్పాలి. ఇప్పుడు గుంటూరు కారంలో ఏకంగా మహేష్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది.
మీనాక్షి మాత్రం ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటో షూట్స్ తో అభిమానులని ఆకట్టుకొంటూనే ఉంది. ఇప్పుడు గుంటూరు కారం మూవీలో ఆఫర్ తో ఈ బ్యూటీ రేంజ్ ఆమాంతం పెరిగిపోయింది. మరో వైపు యంగ్ హీరో విశ్వక్ సేన్ మూవీ లో కూడా నటిస్తుంది. ప్రస్తుతం తను తెలుగులోనే కాకుండా తమిళంలో విజయ్ ఆంటోని తో కూడా జత కట్టింది. తమిళం లో కోలై అనే మూవీ తెలుగులో హత్య అనే టైటిల్ తో వచ్చింది.
ఇలా తెలుగు, తమిళం లో మీనాక్షి తనకంటూ ఒక స్థానం ఏర్పరచుకుంది. సూపర్ స్టార్ ,త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో ఈ అమ్మడుకి ఛాన్స్ వచ్చిందంటే ఈ బ్యూటీ కి లక్ ఉన్నట్లే. గుంటూరు కారం ఎలాగూ హై ఎక్స్పెక్టేషన్స్ తో ఉంది కాబట్టి ఈ మూవీ తరువాత మీనాక్షి స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్లడం ఖాయమనే చెప్పాలి. ఓ పక్క స్టార్ హీరోతో, మరో వైపు యువ హీరోలతో మూవీస్ చేస్తూ, అలానే తన ఫ్యాన్స్ ని మెప్పించేలా ఫోటో షూట్స్ చేస్తూ ఆడియన్స్ కి చేరువలో ఉండటంతో మీనాక్షికి క్రేజ్ తగ్గట్లేదు. మీనాక్షి లిస్ట్ లో ఇవి రెండే కాకుండా మరో రెండు మూవీస్ తన లిస్ట్ లో ఉన్నాయని సమాచారం.













