మరోసారి తస్కరణకు రెడీ
2019లో పెద్దగా అంచనాల్లేకుండా రిలీజైన మత్తు వదలరా సినిమాకు ఊహించని విధంగా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ సినిమాలో ట్విస్టులు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేయగా హీరో శ్రీసింహా ఆ సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. రితేష్ రానా దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాకు సీక్వెల్ రానుందని కొన్ని నెలల కిందటే వార్తలొచ్చాయి.
రీసెంట్ గా సెప్టెంబర్ 13న మత్తు వదలరా2 రిలీజ్ కానున్నట్లు మేకర్స్ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇవాళ తాజాగా ఈ సినిమా నుంచి స్పెషల్ టీజర్ ను రిలీజ్ చేశారు. సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన విషయాలను, కాంట్రవర్సీలను టీజర్ లో బాగానే టచ్ చేశారు. సినిమాలో H.E టీమ్ అంటూ హీరోతో పాటూ సత్య స్పెషల్ ఆఫీసర్లుగా కనిపిస్తున్నారు.
మోస్ట్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్ ను డీల్ చేసే ఈ ఇద్దరు మళ్లీ డబ్బుల కోసం ఎలాంటి అడుగులేశారనేది తెలియాలంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే. హీరోయిన్ ఫారియా కూడా యాక్షన్ రోల్ చేస్తున్నట్లు టీజర్ చూస్తుంటే అర్థమవుతుంది. దొంగతనం చేయడానికి సిగ్గులేదా అని ఆమె అడిగితే దానికి సత్య అది దొంగతనం కాదు తస్కరించుట అని చెప్పే డైలాగ్ టీజర్ కు హైలైట్ గా నిలిచింది. చూస్తుంటే సినిమాలో నేటి తరానికి కనెక్ట్ అయ్యే సీన్స్ ను గట్టిగానే ప్లాన్ చేశారనిపిస్తుంది. మరి ఈ సీక్వెల్ ఆడియన్స్ అంచనాలను ఏ మేరకు అందుకుంటుందో చూడాలి.













