సలార్ ఇంగ్లీష్ వెర్షన్ కోసం సూపర్ ప్లాన్
బాహుబలి మూవీతో పాన్ ఇండియన్ లెవల్లో స్టార్ హీరో రేంజ్ తెచ్చుకున్న ప్రభాస్ కు ఆ తర్వాత సరైన సినిమా ఒక్కటి పడలేదు. లేదంటే ఈ పాటికి ఇండియాలో ప్రభాస్‌ని కొట్టే హీరో లేడు అని అనిపించుకునేవాడు కాదు. కానీ ప్రభాస్ ఇప్పుడు చేస్తున్న సినిమాలతో తన రేంజ్, లెవల్ మారిపోతాయని, తిరిగి ఇండియన్ సినిమాలో బిగ్గెస్ట్ హీరో ట్యాగ్ వేయించుకుంటాడని ఫ్యాన్స ఆశపడుతున్నారు.
ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల్లో సలార్ పై చాలానే హోప్స్ ఉన్నాయి. కెజిఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో, ఈ మూవీకి కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా సినిమా నెక్ట్స్ లెవల్‌కి వెళ్లిపోతుంది. కలెక్షన్ల వర్షం కూడా ఓ రేంజ్ లో కురుస్తుంది. ఈ సినిమా మీద దర్శక నిర్మాతలకు ఉన్న నమ్మకంతో సలార్‌ను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లబోతున్నట్లు రీసెంట్గా వార్తలు వినిపిస్తున్నాయి.
వాస్తవానికి ప్రభాస్ ప్రాజెక్ట్ కె సినిమాతో అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతాడని అందరూ అనుకున్నారు కానీ అంతకంటే ముందు సలార్‌తోనే ఆ రేంజ్‌ని ప్రభాస్ రీచ్ అవుతున్నాడని తెలుసుకున్న ఫ్యాన్స్ ఆనందంతో మునిగి పోతున్నారు. అయితే సలార్‌ను ఏదో హాలీవుడ్ లో రిలీజ్ చేస్తున్నామంటే చేస్తున్నామన్నట్లు కాకుండా పక్కా ప్లానింగ్‌తోనే టీమ్ రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా అన్ని వెర్షన్ల కంటే ముందే హాలీవుడ్ కట్‌ను రెడీ చేయనుందట టీమ్.
ఇండియన్ రిలీజ్‌తో పాటే ఆ వెర్షన్‌ను కూడా రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. పాటలు, కొన్ని డ్రామా సీన్లు తీసేసి, అరగంట వరకు రన్ టైమ్ తగ్గించి ప్రాపర్ హాలీవుడ యాక్షన్ ఫిల్మ్ లాగా సలార్‌ను తీర్చిదిద్దుతున్నాడట నీల్. సలార్ మూవీ సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.













