Mahesh Babu: మహేష్ ముందు ఎన్నో సవాళ్లు
మహేష్ బాబు(Mahesh Babu), రాజమౌళి(rajamouli) కాంబినేషన్ లో సినిమా వస్తుందని తెలిసినప్పటి నుంచి ఫ్యాన్స్ ఎంతగా ఆనందపడుతున్నారో అంతకంటే ఎక్కువగా టెన్షన్ పడుతున్నారు. దానికి కారణం రాజమౌళి పనితనమే. ఆయనతో పని మామూలుగా ఉండదు. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్ బియాండ్(RRR Behind&beyond) ట్రైలర్ చూశాక మహేష్ ఫ్యాన్స్ ఆందోళన మరింత పెరిగింది.
నాటు నాటు(Naatu Nattu) సాంగ్ కు ఎన్టీఆర్(NTR), రామ్ చరణ్(ram charan) ను జక్కన్న(jakkanna) ఎంత హింసించాడో ఇద్దరూ పలు సార్లు చెప్పారు. స్టెప్స్ లో తేడా రాకుండా ఇద్దరికీ సింక్ కుదిరేలా ఒళ్లు హూనం చేశాడని, అందుకే ఆ సాంగ్ అంత గొప్పగా వచ్చి ఆస్కార్(Oscar) సాధించిందని అందరూ అంటారు. అంతేకాదు యాక్షన్ ఎపిసోడ్స్ కు కూడా జక్కన్న హీరోలకు చుక్కలు చూపిస్తాడు.
ఆర్ఆర్ఆర్ అంటే ఇద్దరు హీరోలున్నారు. కానీ ఇప్పుడు మహేష్(Mahesh) ఒక్కడే అన్నింటినీ మేనేజ్ చేయాలి. అసలే ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీ. రియల్ యానిమల్స్ ను వాడకపోయినా సినిమాలో రిస్కీ షాట్లు చాలానే ఉంటాయి. ఇవన్నీ మహేష్ కు సవాళ్లే. జనవరిలో స్టార్ట్ కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇంకా రాలేదు కానీ త్వరలోనే అప్డేట్ వచ్చే అవకాశముంది.













