నాగార్జున మన్మథుడు 2 ?
మన్మథుడు చిత్రం ఎంత ఆదరణ పొందిందో తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్గా చేయాలని నాగార్జున చూస్తున్నాడు. చిత్ర వర్గాల నుండి వస్తున్న సమాచారం ప్రకారం చి.ల.సా చిత్రంతో మెప్పించిన రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున ఈ కొత్త చిత్రంలో నటించనున్నాడు. ఆయన అందించిన కథకు మన్మథుడు 2 అనే టైటిల్ను ఫిల్మ్ ఛాంబర్లో రిజిస్టర్ చేయించారు. జనవరిలో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. ఇక రాహుల్ రవీంద్రన్ చెప్పిన కథ నచ్చడంతో పాటు దానికి ఇంకా తుది మెరుగులు దిద్దాలని నాగార్జున సూచించారట. ప్రస్తుతం ఆ పనిలో దర్శకుడు ఉన్నాడు. ప్రస్తుతం నాగార్జున హీందీలో తెరకెక్కతోన్న బ్రహ్మాస్తలో నటిస్తున్నాడు. ఇది కాకుండా ధనుష్ తెరకెక్కిస్తున్న తమిళ చిత్రంలోనూ నటించనున్నాడు. డిసెంబర్లో ఆ చిత్రం షెడ్యూల్లో పాల్గొననున్నారు.













