మెలోడీ బ్రహ్మకే డబుల్ ఇస్మార్ట్
మెలోడీ బ్రహ్మకే డబుల్ ఇస్మార్ట్ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా డబుల్ ఇస్మార్ట్. ఎప్పుడో షూటింగ్ మొదలు పెట్టిన ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనే ప్రశ్న గత కొంతకాలంగా వెంటాడుతుంది. ఇప్పుడు ఫైనల్ గా ఆ ప్రశ్నకు సమాధానం దొరికింది. ఇస్మార్ట్ శంకర్ కు మంచి పాటలు, గొప్ప బీజీఎం తో ప్రాణం పోసిన మణిశర్మనే ఈ సినిమాకు కూడా సంగీతం అందించనున్నాడని టాక్.
ఒక పాటకు సంబంధించిన ట్యూన్తో పాటూ ఫైనల్ కంపోజింగ్ కూడా ఓకే అయిందని సమాచారం. వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడు మణిశర్మ పేరు లేదు. పూరీతో ఏవో మనస్పర్థల వచ్చాయని, పాన్ ఇండియా సినిమా కాబట్టి హిందీ టీమ్ వైపు మొగ్గు చూపుతుందనే ప్రచారం జరిగింది. కానీ అవేమీ వర్కవుట్ కాలేదని ఇప్పుడు తేలింది.
దీని వెనుక పెద్ద స్టోరీనే జరిగిందని టాక్. ముందు తమన్, అనిరుధ్ లాంటి వాళ్లను ఈ సినిమా కోసం సంప్రదించారని, కానీ రిలీజ్ డేట్ లోపు పనులు జరగాలంటే వాళ్లతో కుదరదని గుర్తించి ఫైనల్గా మణిశర్మకే ఓటేశారని అంటున్నారు. దానికి తోడు ఇది సీక్వెల్ సినిమా కాబట్టి ఫస్ట్ పార్ట్ లోని బీజీఎంను వాడుకోవాలంటే మణిశర్మ ఒప్పుకుంటాడో లేదో అనేది ఓ సమస్య. వీటన్నింటినీ ఆలోచించుకుని పూరీ టీమ్ మణిశర్మకే ఛాన్స్ ఇచ్చింది. పూరీ తీసుకున్న ఈ డెసిషన్ మంచిదే అని అందరూ అభిప్రాయపడుతున్నారు.













