ఛాన్సుల విషయంలో మణిశర్మ ఆవేదన
ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా వెలుగొందిన మణిశర్మ ప్రతీ స్టార్ హీరోకీ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చాడు. ఆయన సంగీతం అందించిన సినిమాలన్నీ అప్పుడు మ్యూజికల్ హిట్సే. అందుకే మణిశర్మ కాస్తా మెలోడీ బ్రహ్మగా మారాడు. కేవలం మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వినడానికి కూడా ఆడియన్స్ థియేటర్లకు వచ్చేవారంటే ఆయన స్థాయి, క్రేజ్ అర్థం చేసుకోవచ్చు.
కానీ వరుస ఫ్లాపులు ఆయన కెరీర్ కు బ్రేక్ వేశాయి. ఇస్మార్ట్ శంకర్ తో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడనుకుంటే ఆ తర్వాత మళ్లీ డిజాస్టర్లు అందుకున్నాడు. దీంతో ఇప్పుడు మణి ఆశలన్నీ అతను చేస్తున్న డబుల్ ఇస్మార్ట్ పైనే ఉన్నాయి. అయితే మణిశర్మ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తనను స్టార్ హీరోలు దూరం పెట్టడంపై ఆవేదన వ్యక్తం చేశాడు.
దేవీ, తమన్ కు ఎన్నో అవకాశాలిస్తున్న స్టార్ హీరోలు తనకు ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వకపోవడం బాధగా ఉందన్నాడు మణిశర్మ. ఒకప్పుడు మహేష్, పవన్ తో తనకు మంచి బాండింగ్ ఉండేదని చెప్పిన ఆయన ఇప్పుడా బాండింగ్ లేదని తెలిపాడు. ఆయన ఆవేదనలో న్యాయముంది కానీ ఇస్మార్ట్ తర్వాత మణికి వచ్చిన ఛాన్సులేమీ చిన్నవి కావు.
ఆచార్య, శాకుంతలం, శ్రీదేవి సోడీ సెంటర్, సీటీ మార్, బలా తందనాన ఈ సినిమాలన్నింటిలో ఒకటి రెండు పాటలే బాగున్నాయి తప్పించి ఆల్బమ్ మొత్తం బాగుందనేలా ఒక్క సినిమాకు కూడా మణి మ్యూజిక్ ఇవ్వలేదు. కాబట్టి తనలో కంపోజింగ్ పవర్ అలాగే ఉందని, డబుల్ ఇస్మార్ట్ తో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం మణికి ఎంతైనా ఉంది. అప్పుడే మహేష్, పవన్ లాంటి స్టార్ల నుంచి మళ్ళీ ఆయనకు అవకాశాలొచ్చే ఛాన్సుంది.













