Manchu Vishnu: కన్నప్ప చెప్పిన డేట్ కే వస్తుంది

మంచు విష్ణు(Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్టుగా వస్తోన్న సినిమా కన్నప్ప(Kannappa). ఈ సినిమాను మంచు మోహన్ బాబు నటిస్తూ, భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమా కోసం విష్ణు తన కెరీర్లో ఎన్నడూ లేనంతగా కష్టపడ్డాడు. అంతేకాదు, కన్నప్ప కథపై కొన్ని ఏళ్ల పాటూ విష్ణు వర్క్ చేశాడు. ఎలాగైనా కన్నప్ప సినిమాను తన కెరీర్లోనే మైల్ స్టోన్ ఫిల్మ్ గా నిలుపుకోవాలని విష్ణు చాలా ప్రయత్నించాడు.
ముకేష్ కుమార్ సింగ్(mukesh kumar singh) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో భారీ తారాగణం కూడా నటించింది. ఈ సినిమాలో బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్ కుమార్(akshay kumar) తో పాటూ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), మోహన్ లాల్(Mohan lal), కాజల్ అగర్వాల్(Kajal Agarwal) కీలక పాత్రల్లో నటించారు. ప్రభాస్ పాత్ర అయితే కన్నప్పలో దాదాపు 30 నిమిషాల పాటూ ఉండనుందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఎప్పుడో రిలీజ్ కావాల్సిన కన్నప్ప కొన్ని కారణాల వల్ల పలుమార్లు వాయిదా పడి ఆఖరికి అన్ని సమస్యలన్నీ దాటుకుని జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రావడానికి రిలీజైంది. అందులో భాగంగానే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను కూడా వేగవంతం చేయగా, ఈ టైమ్ లో కన్నప్ప మరోసారి వాయిదా పడుతుందని వార్తలొస్తుండగా, దానిపై విష్ణు క్లారిటీ ఇచ్చాడు. ఎట్టి పరిస్థితుల్లో తన కన్నప్ప సినిమా జూన్ 27నే వస్తుందని, ఆల్రెడీ దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లతో పాటూ తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ఈవెంట్స్ చేయడానికి ప్లాన్స్ కూడా చేసుకున్నట్టు విష్ణు చెప్పాడు. దీంతో కన్నప్ప 27న రిలీజవడం ఖాయమని తేలింది.