జూన్ లో మోసగాళ్ళు
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా హాలీవుడ్ ఇండియన్ సినిమా మోసగాళ్ళు. హాలీవుడ్‌కు చెందిన జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథనాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో లాక్డౌన్ ప్రకటించడంతో చిత్రంలో కీలకమైన ఐటీ ఆఫీస్ సన్నివేశాల చిత్రీకరణ నిలిచిపోయింది. కాగా ఈ చిత్రం తెలుగు వెర్షన్‌ను జూన్ 5న, ఇంగ్లిష్ వెర్షన్ ను జూలైలో విడుదల చేయనున్నట్లు విష్ణు తెలిపారు. ఇటీవల విడుదల చేసిన మోసగాళ్ళ ఫస్ట్ లుక్ పోస్టర్లకు ప్రేక్షకులు, అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది. ఆ పోస్టర్లలో అర్జున్‌గా విష్ణు, అను పాత్రలో కాజల్ అగర్వాల్, ఏసీపీ కుమార్‌గా సునీల్ శెట్టి కనిపించారు అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ సినిమాలో నవదీప్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.













