ఆయనతో నాకు ఎలాంటి గొడవ లేదు: మంచు విష్ణు
తిరుమల లడ్డు(Tirumala Laddu) వివాదంలో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్(Prakash Raj) చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. అయితే ప్రకాష్ రాజ్ అభిప్రాయాన్ని విభేదించినంత మాత్రాన ఆయనతో తనకు వ్యక్తిగత గొడవలున్నట్లు కాదని మా(MAA) అధ్యక్షుడు మంచు విష్ణు(Manchu Vishnu) పేర్కొన్నాడు. మా ఎన్నికల్లో విష్ణు గెలిచింది కూడా ప్రకాష్ రాజ్ మీదే.
ఆ ఎన్నికల టైమ్ లో ఇద్దరూ ఒకరిపై ఒకరు ఎన్నో విమర్శలు, ఆరోపణలు చేసుకున్నారు. తర్వాత కూడా వారి మధ్య కొంతకాలం ఘర్షణ కొనసాగింది. లడ్డు వివాదంలో ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి మంచు విష్ణు మీరు మీ పరిధిలో ఉండండంటూ కౌంటర్ వేయడం ఇప్పుడు డిస్కషన్స్ కు దారి తీసింది. ఈ విషయంలో తాజాగా మంచు విష్ణు స్పందించాడు.
లడ్డు వివాదంలో ప్రకాష్ రాజ్ గారు చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదని మాత్రమే తాను అన్నానని, ఓ హిందువుగా, తిరుపతి వాసిగా ఆ వివాదానికి మతం రంగు లేదని చెప్పడమే తన ఉద్దేశమని, ప్రకాష్ రాజ్ ట్వీట్ ఆయన వ్యక్తిగత అభిప్రాయమైతే, తాను తన వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలియచేశానన్నాడు. ఆయన వ్యాఖ్యలు కరెక్ట్ కాదని మాత్రమే చెప్పానని, వ్యక్తిగతంగా ప్రకాష్ రాజ్ గారి మీద తనకెంతో గౌరవముందని, ఆయన్ని నేను అంకుల్ అని పిలుస్తుంటానని, ఈ విషయంలో ఎలాంటి వివాదం లేదని మంచు విష్ణు క్లారిటీ ఇచ్చాడు.













