Manchu Manoj: తిరుపతిలో మంచు మనోజ్ అరెస్ట్
మంచు ఫ్యామిలీలో గొడవలు హైదరాబాద్ నుంచి తిరుపతికి చేరాయి. మోహన్ బాబు(Mohan Babu) యూనివర్సిటీకి తాత గారి సమాధిని చూడ్డానికి గతంలో మనోజ్(Manoj) తన అనుచరులతో వెళ్లడం గందరగోళానికి దారి తీసింది. తిరుపతి పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఆ వివాదం అప్పటికి ముగిసింది. అయితే ఇప్పుడు మళ్లీ తిరుపతిలో తాజాగా వారి సినిమా మొదలైంది.
తిరుపతి వెళ్లిన మనోజ్‌ను బాకారావు పేట పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. మనోజ్ అరెస్టుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలియాల్సి ఉన్నాయి. గత కొన్ని రోజులుగా ఆస్తి పంపకాలకు సంబంధించిన మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో జల్లికట్టు కార్యక్రమంలో మనోజ్ రీసెంట్ గా పాల్గొన్నాడు. అక్కడి ఫ్యాన్స్ మనోజ్ కు పెద్ద గజమాలతో గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. అంతేకాదు, ఏపీ మినిస్టర్ నారా లోకేష్(Nara Lokesh) ను కూడా మనోజ్ నిన్న కలిశాడు. మొత్తానికి మనోజ్ అరెస్ట్ విషయం మాత్రం ప్రస్తుతం నెట్టింట హల్చల్ అవుతుంది. మరి ఈ గొడవలన్నీ ఎప్పుడు కొలిక్కి వస్తాయో చూడాలి.













