Manchu Manoj: లక్ష్మి అక్క కాదు, అమ్మ

గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న మంచు మనోజ్(Manchu Manoj) ఇప్పుడు భైరవం(Bhairavam) సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నాడు. విజయ్ కనకమేడల(Vijay Kanakamedala) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మే 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Sreenivas), నారా రోహిత్(Nara Rohit) కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, డైరెక్టర్ శంకర్(Shankar) కూతురు అదితి శంకర్(Aditi Shankar) ఈ సినిమాతో వెండితెర అరంగేట్రం చేయబోతుంది.
రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్న మంచు మనోజ్ ఆ ప్రమోషన్స్ లో సినిమాతో పాటూ పలు వ్యక్తిగత విషయాల గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఈ సందర్భంగా మనోజ్ తన అక్క లక్ష్మి(Manchu Lakshmi) గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఓ నెల ముందు వీరిద్దరూ ఓ ఫ్యాషన్ షో లో కలవగా, మనోజ్ ను చూడగానే లక్ష్మి ఎమోషనల్ అయి ఏడ్చేసిన విషయం తెలిసిందే.
దాని గురించి మనోజ్ భైరవం ప్రమోషన్స్ లో మాట్లాడాడు. గత కొన్నాళ్లుగా అక్క, నేను ఎవరికి వాళ్లం మా లైఫ్స్ లో బిజీ అయిపోయామని అప్పటికే ఇద్దరం కలిసి ఓ నెలకు పైగా అవుతుందని, సడెన్ గా అక్కడికి వెళ్లి అక్కను సర్‌ప్రైజ్ చేయగానే తానెంతో ఎమోషనల్ అయి ఏడ్చేసిందని, తను నా బెస్ట్ ఫ్రెండ్ అని, చిన్నప్పటి నుంచి తను నన్ను అక్కలా కాకుండా అమ్మలా చూసుకుందని అక్కపై తన ప్రేమను చాటాడు మనోజ్.