వాటి వల్ల ఎంతో బాధ పడ్డా: మంచు లక్ష్మి
నటీనటులన్నాక ఏదొక దశలో ట్రోలింగ్స్ తప్పవు. కానీ టాలీవుడ్ లో మంచు ఫ్యామిలీ ఎదుర్కొన్నన్ని ట్రోలింగ్స్ మరెవరూ ఎదుర్కొని ఉండరు. అమెరికాలో చాలా సంవత్సరాలుండి తిరిగి ఇండియాకు వచ్చి మంచు లక్ష్మి, అక్కడి యాసెంట్ తో మాట్లాడటంపై సోషల్ మీడియాలో ఎన్నోసార్లు ట్రోల్స్ ఎదుర్కొంది. వ్యక్తిగతంగా ఎంతో స్పోర్టివ్ గా ఉండే మంచు లక్ష్మి ఆ ట్రోల్స్ చూసి గతంలో బాధ పడ్డానని తెలిపింది.
యక్షిణి వెబ్ సిరీస్ కు సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొన్న లక్ష్మి ఈ విషయాన్ని వెల్లడించింది. మొదట్నుంచి తనకు ముక్కుసూటిగా మాట్లాడటమే అలవాటని, కొందరు తనను అదే పనిగా ట్రోల్ చేయడం చూసి బాధేసిందని, ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం వల్లే తనపై ఈ ట్రోలింగ్ ఎక్కువ అయిందని, మొదట్లో వాటన్నింటినీ చూసి తెగ బాధ పడిపోయిన తను తర్వాత వాటికి అలవాటు పడిపోయినట్లు చెప్పుకొచ్చింది.
ఇక కన్నప్ప గురించి మాట్లాడుతూ, ఆ సినిమాలో తాను నటించడం లేదని స్పష్టం చేసింది. తనే కాదు, మనోజ్ కూడా కన్నప్పలో భాగం కాదని లక్ష్మి తెలిపింది. తనకు సరిపోయే పాత్ర కన్నప్పలో లేదు కాబట్టే అందులో నటించడం లేదని భావిస్తున్నట్లు తెలిపిన లక్ష్మి, ఆ సినిమాలో మనోజ్, తాను కూడా ఉండి ఉంటే అది తమ ఫ్యామిలీ సినిమా అయ్యేదని ఆమె చెప్పుకొచ్చింది.













