Manchu Lakshmi: కన్నప్ప లో ఎందుకు లేనంటే

మంచు విష్ణు(Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కిన కన్నప్ప(Kannappa) మూవీలో తన తండ్రి మోహన్ బాబు(Mohan Babu) తో పాటూ తన ముగ్గురు పిల్లల్ని కూడా నటింపచేశాడు. అయితే ఆ సినిమాలో మంచు మనోజ్(Manchu Manoj), మంచు లక్ష్మి(Manchu Lakshmi) మాత్రం లేరు. వారిలో మనోజ్ ఎందుకు కన్నప్పలో భాగం కాలేదనే సంగతి అందరికీ తెలుసు. కానీ మంచు లక్ష్మి ఎందుకు కన్నప్పలో భాగం కాలేదనేది మాత్రం ఎంతోమందికి ప్రశ్నగానే మిగిలింది.
అయితే ఓ సందర్భంలో తాజాగా మంచు లక్ష్మికి ఇదే ప్రశ్న ఎదురైంది. కన్నప్పలో మీరెందుకు నటించలేదని మంచు లక్ష్మిని అడగ్గా, కన్నప్పలో తానెందుకు లేననే విషయాన్ని విష్ణునే అడగాలని, బహుశా తాను నటిస్తే ఇంకెవరూ కనిపించరనే ఉద్దేశంతో కాబోలు అని ఫన్నీగా చెప్పింది. వాస్తవానికి కన్నప్ప లాంటి భారీ ప్రాజెక్టులో విష్ణు అనుకుంటే లక్ష్మికి ఓ పాత్ర ఇవ్వడం పెద్ద మ్యాటరేమీ కాదు.
కానీ విష్ణు మాత్రం ఆ ఛాన్స్ తీసుకోలేదు. మంచు లక్ష్మికి ఛాన్స్ ఇవ్వలేదు. మనోజ్ కు మద్దుతు ఇస్తున్న కారణంగానే విష్ణు, తన అక్క అయిన మంచు లక్ష్మికి కన్నప్పలో అవకాశమివ్వలేదేమో అనే కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఈ విషయంలో విష్ణు క్లారిటీ ఇస్తేనే అసలు విషయం తెలుస్తుంది. కాగా భారీ క్యాస్టింగ్ తో తెరకెక్కిన కన్నప్ప జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.