జనవరి 1న రాజా నరసింహా
కల్తీ మందుల ద్వారా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న సంఘ విద్రోహశక్తులపై రాజా నరసింహ ఎలాంటి పోరాటం సాగించాడో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు నిర్మాత సాధుశేఖర్. జై చెన్న కేశవ పిక్చర్స్ పతాకంపై ఆయన నిర్మించిన చిత్రం రాజా నరసింహా. మలయాళ చిత్రం మధుర రాజా కు అనువాదమిది. మమ్ముట్టి కథానాయకుడు. వైశాఖ్ దర్శకుడు. జనవరి 1న విడుదలకానుంది. నిర్మాత మాట్లాడుతూ సందేశాత్మక కథాంశంతో యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. మమ్ముట్టిపై తెరకెక్కించిన పోరాట ఘట్టాలు, సన్నీలియోన్ ప్రత్యేక గీతం సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తాయి అన్నారు.













