Mamitha Baiju: వరుస ఆఫర్లతో బిజీగా ప్రేమలు బ్యూటీ

చిత్ర పరిశ్రమలో ఎవరికెప్పుడు స్టార్ డమ్ వస్తుందో ఎవరూ చెప్పలేరు. ఒక వారం ఒకరు స్టార్ అయితే మరో వారం మరొకరు స్టార్ గా నిలుస్తారు. ప్రేమలు(premalu) సినిమాతో అందులో నటించిన హీరోయిన్ మమిత బైజు(mamitha baiju) కూడా అలానే ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయింది. ఆ సినిమా ఒక్కసారిగా అమ్మడి లైఫ్ ను మార్చేసింది. ప్రేమలు సినిమా కంటే మమిత బైజు పలు సినిమాల్లో నటించినప్పటికీ అవేవీ ఇవ్వలేని స్టార్‌డమ్ ను మమితకు ప్రేమలు సినిమా ఇచ్చింది.
కేవలం మలయాళంలోనే కాకుండా ప్రేమలు సినిమా రిలీజైన ప్రతీ భాషలోనూ ఆ సినిమా తర్వాత మమితకు అభిమానులు ఏర్పడ్డారు. మమిత క్రేజ్ చూసి ఆమెకు ఆఫర్లు కూడా బాగానే వస్తున్నాయి. ఆ ఆఫర్లలో స్టార్ హీరోలైన విజయ్(Vijay) తో ఓ సినిమా మరియు సూర్య(suriya)తో ఓ సినిమా కూడా ఉంది. జననాయగన్(jana nayagan) సినిమాలో మమిత కీలక పాత్రలో నటిస్తుండగా, సూర్య హీరోగా వెంకీ అట్లూరి(Venky Atluri) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో మమిత హీరోయిన్ గా నటిస్తోంది.
వీటితో పాటూ ఆల్రెడీ ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganadhan) సరసన డ్యూడ్(Dude) అనే సినిమాలో నటిస్తోంది మమిత. ఇప్పటికే ఇరండు వానం రిలీజ్ కు రెడీ అయింది. వీటితో పాటూ రీసెంట్ గా ప్రేమలు మూవీలో తన బెస్ట్ ఫ్రెండ్ గా నటించిన సంగీత్ ప్రతాప్(sangeeth prathap) తో కలిసి మమిత ఓ మూవీ చేయడానికి సైన్ చేసింది. మొత్తానికి మమిత పలు భాషల్లో బిజీ హీరోయిన్ గా మారింది. కాదు కాదు, ప్రేమలు సినిమా అమ్మడిని అలా మార్చేసింది.