దేవర2 వచ్చేదప్పుడనా?
ఆచార్య సినిమాతో డిజాస్టర్ అందుకున్నప్పటికీ కొరటాల శివ మీద ఎంతో నమ్మకంతో ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ ఆయనతో దేవర అనే సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. దేవర కథ ఎంతో బాగా రావడంతో సినిమా ఒక పార్ట్ గా చెప్పడానికి వీలు కాదని రెండు భాగాలుగా రిలీజ్ అవుతుందని చెప్పారు. దీంతో సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి.
దానికి తగ్గట్టే దేవర నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి టీజర్, మొన్న వచ్చిన ఫస్ట్ లిరికల్ వరకు అన్నీ అంచనాలను అంతకంత పెంచుతూనే ఉన్నాయి. దానికి తోడు దేవర ప్రతి ఫ్యాన్ కాలర్ ఎత్తుకునేలా చేస్తుందని స్వయంగా ఎన్టీఆర్ చెప్పడంతో ఆయన ఫ్యాన్స్ అంచనాలకు హద్దు లేకుండా పోయింది. దేవర అక్టోబర్ 10న రిలీజ్ కానుంది.
ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ సెకండ్ పార్ట్ పార్ట్ కు అదిరిపోయే లీడ్ అవుతుందని చెప్తున్నారు చిత్ర యూనిట్. ప్రస్తుతం దేవర1 తో పాటూ వార్2 చేస్తున్న ఎన్టీఆర్ ఆగస్ట్ నుంచి ప్రశాంత్ నీల్ సినిమా చేయనున్నాడు. అందుకే దేవర2 కోసం ఎన్టీఆర్ 2025లో కాల్షీట్స్ ను అడ్జెస్ట్ చేయనున్నాడట. 2025లోనే షూటింగ్ ను ఫినిష్ చేసి 2026 సంక్రాంతికి లేదా సమ్మర్ కు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు దేవర1 క్లైమాక్స్ లోనే దేవర2 రిలీజ్ డేట్ చెప్పనున్నారంటున్నారు. మరి ఇందులో నిజమెంతన్నది చూడాలి. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సౌత్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.













