మహేష్28 టైటిల్ వార్తలన్నీ అబద్దాలే!
టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్లకు ఉండే క్రేజే వేరు. హిట్టు ఫ్లాపు రికార్డులతో పోలిస్తే వాళ్ల కాంబినేషన్లకు ఓ రేంజ్లో హైప్ ఉంటుంది. అలాంటి కాంబినేషన్లలో ఒకటి మహేష్ బాబు- త్రివిక్రమ్. వీరిద్దరి కాంబోలో మూడో సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్ అయిన దగ్గర నుంచి అందరికీ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి.
దానికితోడు ఈ సినిమాతో రాజమౌళి రికార్డులకు దగ్గరగా వెళ్లిపోతామని చెప్పడంతో ఫ్యాన్స్ ఓ రేంజ్లో ఖుషీ అయ్యారు. సినిమా జానర్ పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనరే అని చెప్తూనే, కలెక్షన్ల సునామీ ఖాయమని చెప్పడం ఇంట్రెస్టింగ్ గా ఉంది. టైటిల్‌కు సంబంధించి రకరకాల ప్రచారాలు టాలీవుడ్లో చక్కర్లు కొడుతున్నాయి.
ఆ వార్తల్లో కొన్ని నమ్మేలా ఉంటే, మరికొన్ని కామెడీగా అనిపిస్తున్నాయి. అయోధ్యో అర్జునుడు అనేది ఇందులో మొదటిది. ఇది కాకుండా కేవలం అర్జునుడు అనే టైటిల్ కూడా చక్కర్లు కొడుతుంది. కాకపోతే మహేష్ ఇప్పటికే అర్జున్ అనే పేరుతో సినిమా చేయడంతో అదేమీ ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో తీసుకోకపోవచ్చు.
వాటితో పాటూ అతడే తన సైన్యం అనేది కూడా మరో టైటిల్. ఇది ఎప్పుడో వచ్చిన ఒక్కడు సినిమా కోసం అనుకున్నారు కానీ తర్వాత డ్రాప్ అయ్యారు. ఇక అన్నింటికంటే పెద్ద జోక్‌గా అనిపిస్తున్న టైటిల్ అమ్మకథ. ఇలాంటి టైటిల్‌ను మహేష్ సినిమాకు పెట్టారంటే కామెడీగా అనిపిస్తుంది. వాస్తవానికి ఈ టైటిల్స్ లో ఏదీ ఇంకా ఫిక్స్ అవలేదనేది మాత్రం వాస్తవం. త్రివిక్రమ్ కు అ తో మొదలయ్యే టైటిల్‌ను పెట్టడం సెంటిమెంట్ కాబట్టి, దాని గురించి చూస్తున్నారట. మరి ఇలా ఉంటే ఉగాదికి SSMB28 నుంచి టైటిల్ లాంచ్ చేయడం కష్టంగానే కనిపిస్తుంది.













