మహేష్ బాబుకు నమ్రత విషెస్…
సూపర్‌స్టార్ మహేష్ బాబు పక్కా ఫ్యామిలీ మేన్. కెరీర్‌తో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి వీలైనంత ఎక్కువ సమయం కేటాయిస్తాడు. భార్య, పిల్లలతో కలిసి వీలు కుదిరినప్పుడల్లా విహార యాత్రలకు వెళుతుంటాడు. టాలీవుడ్లో అత్యంత అన్యోన్నమైన జంటాగా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు మహేష్ బాబు, నమ్రత. ఈ రోజు వీరి వివాహ వార్షికోత్సవం. ఈ సందర్భంగా నమత్ర సోషల్ మీడియా ద్వారా మహేష్‌కు విషెస్ చెప్పారు. 16 ఏళ్లు చాలా సులభంగా గడిచిపోయాయి. బలమైన ప్రేమ, నమ్మకం, విశ్వాసం కలయికతో మన వైవాహిక జీవితం రూపుదిద్దుకుంది. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు మహేష్‌బాబు నిన్ను మరింత ఎక్కువగా ప్రేమిస్తున్నానని నమ్రత కామెంట్ చేశారు. మహేష్‌ను ముద్దు పెట్టుకుంటున్న ఫొటోను కూడా పోస్ట్ చేశారు.













